విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి - 10 రోజుల పాటు అమెరికా, యూకే టూర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు.  10 రోజుల పాటు లండన్, అమెరికాలో పర్యటించనున్నారు. 

Published on: Aug 20, 2026, 16:48:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK), యునైటెడ్ స్టేట్స్ (USA) దేశాల్లో 10 రోజుల పాటు కొనసాగే ఈ అధికారిక పర్యటన నిమిత్తం ఆయన బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (గురువారం తెల్లవారుజామున) ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరి వెళ్లారు.

సీఎం రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)
సీఎం రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)

న్యూఢిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ వ్యవహారాల సలహాదారు హర్కర వేణుగోపాల్‌తో పాటు పలువురు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాదరంగా వీడ్కోలు పలికారు. ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి హాజరైన సీఎం, అక్కడ నుంచే నేరుగా విదేశీ పర్యటనకు పయనమయ్యారు.

లండన్ టూర్ వివరాలు…

తన యూకే పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 21న ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శిస్తారు. అనంతరం ప్రముఖ ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ (EPL) ఫుట్‌బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ ప్రతినిధుల బృందంతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. అదే రోజు లండన్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌తో పాటు ప్రసిద్ధ లండన్ బిజినెస్ స్కూల్‌ను కూడా ఆయన సందర్శించనున్నారు.

లండన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకుంటారు. ఆగస్టు 24న ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) క్యాంపస్‌లను ఆయన సందర్శిస్తారు.

ఆగస్టు 25న బోస్టన్ నగరాన్ని సందర్శించి, అక్కడ ఉన్న నార్త్-ఈస్టర్న్ క్యాంపస్‌ను చూడటంతో పాటు వర్జీనియా టెక్ యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారుల బృందంతో సమావేశమవుతారు.

ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (USA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్రత్యేక 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ శ్రేణులతో ఆయన ముఖాముఖి మాట్లాడనున్నారు. పర్యటన చివరగా ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి బయలుదేరి… ఆగస్టు 30వ తేదీ నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More