...
...
Next Story

Job Mela : ఈనెల 25న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా - ముఖ్య వివరాలు

Osmania University Job Mela 2026 : ఓయూలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఆగస్టు 25న మెడ్ ప్లస్ జాబ్ మేళా జరగనుంది. డిఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ అర్హత కలిగిన వారు హాజరుకావచ్చు.

Published on: Aug 20, 2026, 10:24:15 IST
Advertisement

Osmania University Job Mela 2026 : ఉద్యోగార్థులకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉస్మానియా యూనివర్సిటీ తీపి కబురు అందించింది. ఓయూ ఆవరణలోని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో (UEIGB) / మోడల్ కెరీర్ సెంటర్ (MCC) ఆధ్వర్యంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ 'మెడ్ ప్లస్' భాగస్వామ్యంతో ఈ నెల ఆగస్టు 25న జాబ్ మేళాను నిర్వహిస్తోంది.

ముఖ్య వివరాలు…

ఈనెల 25న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా (image source Pixel )
ఈనెల 25న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా (image source Pixel )

ఈ జాబ్ మేళా ద్వారా మెడ్ ప్లస్ సంస్థలో ఖాళీగా ఉన్న ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ విభాగాల్లో మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో చీఫ్ టి. రాము వెల్లడించారు.

  • విద్యార్హతలు : డి.ఫార్మసీ (D.Pharmacy), బీ.ఫార్మసీ (B.Pharmacy), ఎం.ఫార్మసీ (M.Pharmacy) లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
  • వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
  • ఫార్మాసిస్ట్ (Pharmacist ): ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 వరకు వేతనం అందిస్తారు.
  • అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ (Assistant Pharmacist) : వీరికి నెలకు రూ. 16,000 వరకు వేతనం లభిస్తుంది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25, 2026న ఉదయం 11:00 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ‘యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో’కార్యాలయంలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe