TG TET Mock Test 2026 : తెలంగాణ టెట్ అభ్యర్థులు అలర్ట్ - మాక్ టెస్టులు ప్రారంభం,ఇదిగో డైరెక్ట్ లింక్

TG TET Mock Test 2026 : తెలంగాణ టెట్ - 2026(జూన్ సెషన్) అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లో లాగిన్ అయి రాసుకోవచ్చు.

Published on: May 26, 2026, 06:02:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG TET Mock Test 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026 - జూన్) రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి, సమయ పాలన అలవర్చుకోవడానికి వీలుగా అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ ఆప్షన్లను ప్రారంభించారు.

టీజీ టెట్ 2026
టీజీ టెట్ 2026

టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ సందర్శించి ఈ మాక్ టెస్టులను రాయవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఎలాంటి తప్పులు చేయకుండా ప్రశాంతంగా పరీక్ష రాయడానికి ఈ మోడల్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి.

టీజీ టెట్ మాక్ టెస్టులు - ఎలా రాయాలంటే..?

  • టెట్ అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని మాక్ టెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కొత్త విండో ఓపెన్ కావాలి. సైన్ ఇన్ కావాలి.
  • ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా సైన్‌-ఇన్‌ అవడం ద్వారా ఉచిత మాక్‌ టెస్టులను ఉపయోగించుకోవచ్చు.
  • ఈ పరీక్షలను రాయటం ద్వారా పరీక్షా విధానంతో పాటు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఓ అవగాహనకు రావొచ్చు.

"ఆన్‌లైన్ పరీక్షల పట్ల అభ్యర్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టడానికి, సిలబస్‌పై పట్టు సాధించడానికి ఈ మాక్ టెస్టులు బాగా తోడ్పడతాయి" అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు డిజిటల్ పరీక్షా విధానానికి అలవాటు పడేందుకు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటిసారి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పరీక్ష రాసేవారికి సమయం సరిపోకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి విద్యాశాఖ ఈసారి ముందే లింకులను అందుబాటులోకి తెచ్చింది. నెట్ సెంటర్లు లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా అభ్యర్థులు వీటిని ఉచితంగా ప్రాక్టీస్ చేయవచ్చు.

జూన్ లో పరీక్షలు…

జూన్ నెలలో నిర్ణీత తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో హాల్ టికెట్లను ఉంచుతారు. ఇంకా పరీక్షల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.

టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టెట్ స్కోర్ ఆధారంగా డీఎస్సీలో వెయిటేజీ ఇస్తారు.

తెలంగాణ టెట్ 2026(జూన్ సెషన్) - ముఖ్యమైన తేదీలు:

  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : 09.06.2026 నుండి
  • పరీక్షల నిర్వహణ తేదీలు: జూన్ 15, 2026 నుండి జూన్ 30, 2026 వరకు
  • ఫలితాల ప్రకటన: 28.07.2026 నుండి 31.07.2026 మధ్య టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.

టీజీ టెట్ పరీక్షలో క్వాలిఫై కావడానికి కేటగిరీల వారీగా కనీస మార్కుల శాతాన్ని నిర్ణయించారు. మొత్తం 150 మార్కులకు గాను సాధించాల్సిన క్వాలిఫైయింగ్ మార్కులు ఇలా ఉన్నాయి:

  • జనరల్ / ఈడబ్ల్యూఎస్ (General / EWS): 60 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి (90 మార్కులు).
  • బీసీ (BC) అభ్యర్థులు: 50 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి (75 మార్కులు).
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు: 40 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి (60 మార్కులు).

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి టీజీ టెట్ మాక్ టెస్టులు రాయవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More