TG TET 2026 : టీజీ టెట్ అభ్యర్థులకు అలర్ట్… ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్..! చివరి తేదీ ఎప్పుడంటే?

TG TET Edit Option : తెలంగాణ టెట్ (TG TET 2026) దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. మే 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

Published on: May 1, 2026, 10:35:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

TG TET Edit Option : టీజీ టెట్ - 2026కి సంబంధించి విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో…. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

తెలంగాణ టెట్ (istock image)
తెలంగాణ టెట్ (istock image)

అభ్యర్థులు తమ వివరాలను సరిచేసుకునేందుకు మే 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లు జారీ చేసిన తర్వాత లేదా ఫలితాల వెల్లడి సమయంలో తప్పులు గుర్తిస్తే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి…. ప్రతి అభ్యర్థి తమ దరఖాస్తును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని విద్యాశాఖ సూచించింది.

టీజీ టెట్ అప్లికేషన్ - ఎడిట్ ప్రాసెస్ ఇలా

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet.aptonline.in/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని Correction Application లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఆధార్ నెంబర్, జర్నల్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • ఇక్కడ మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
  • చివరగా సబ్మిట్ చేస్తే ఎడిట్ ప్రాసెస్ పూర్తవుతుంది.

మే నెలలో నిర్ణీత తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో హాల్ టికెట్లను ఉంచుతారు. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు.

అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More