వేసవికాలం కావటంతో…. సెలవుల సీజన్ నడుస్తోంది. ఈ వీకెండ్‌లో సరదాగా ఫ్యామిలీతో కలిసి మెట్రోలో షికారు చేయాలన్నా, ఏదైనా ప్రముఖ ఆలయాన్ని సందర్శించాలన్నా, లేక పిల్లలతో కలిసి పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలను చూడాలనుకున్నా అందరికీ గుర్తొచ్చే మొదటి సమస్య ‘క్యూ లైన్లు’…! ఎండ తీవ్రతలో టికెట్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి నిరీక్షించడం ఎంతో విసుగును కలిగిస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ వీకెండ్ ప్లాన్ మొత్తం సాఫీగా సాగిపోతుంది.

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని 'మీ సేవా' (Mee Seva) విభాగం ప్రవేశపెట్టిన మీ టికెట్ (Mee Ticket) యాప్ ఇప్పుడు పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. "టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే" అనే నినాదంతో వస్తున్న ఈ అప్లికేషన్ ద్వారా ఇంటి నుంచే వివిధ రకాల టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కలుగుతోంది.
ఒకే యాప్.. ఎన్నో సేవలు
ఈ యాప్ కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు. ఆర్టీసీ, అధ్యాత్మికం, టూరిజంతో పాటు అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయి.
- ప్రయాణ సౌకర్యాలు: మెట్రో రైల్ టికెట్లు, ఆర్టీసీ బస్సు ప్రయాణ టికెట్లు.
- పర్యాటక ప్రాంతాలు: పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ ఫోర్ట్ వంటి చారిత్రక ప్రదేశాల ప్రవేశ టికెట్లు.
- ఆధ్యాత్మికం - వినోదం: ప్రముఖ టెంపుల్ విజిట్స్, జూ పార్క్, ఫారెస్ట్ సఫారీ టికెట్లు.
- ఈవీ ఛార్జింగ్: ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తుంటే… మీకు సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల లొకేషన్లను కూడా ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
అనూహ్య స్పందన…..
ప్రవేశపెట్టిన అనతి కాలంలోనే 'మీ టికెట్' యాప్ ప్రజలకు చేరువయ్యింది. ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం… ఇప్పటివరకు సుమారు 2.5 లక్షల మంది పౌరులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 6 లక్షలకు పైగా సేవలను ప్రజలు ఈ యాప్ ద్వారా వినియోగించుకున్నారు. సురక్షితమైన పద్ధతిలో దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని 219 లోకేషన్లలో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని సేవలు తీసుకువస్తాం: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ యాప్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ సేవలను ప్రజల నిత్య జీవితంలో మరింత భాగం చేయడమే లక్ష్యమని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని విభాగాలను ఈ యాప్ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు
{{/usCountry}}రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ యాప్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ సేవలను ప్రజల నిత్య జీవితంలో మరింత భాగం చేయడమే లక్ష్యమని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని విభాగాలను ఈ యాప్ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు
{{/usCountry}}మీ- సేవా కమిషనర్ టీ. రవి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎండలో క్యూ లైన్లలో నిలబడి ఇబ్బంది పడకుండా, సౌకర్యవంతంగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకోవడానికి 'మీ టికెట్' యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని స్మార్ట్ డిజిటల్ సేవలను అనుభవించాలని కోరారు.