హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిదానీ నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2025 ఏడాదికి సంబంధించి పలు విభాగాల్లో ఐటీఐ ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. https://midhani-india.in/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్లతో పాటు అప్లికేషన్ ఫారమ్ ను కూడా అందుబాటులో ఉంచారు.

{{^htLoading}} {{/htLoading}}
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ లు కలిపి మొత్తం 210 ఖాళీలున్నాయి. వీటిలో అత్యధికంగా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 160గా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. విద్యార్హతల్లోని మార్కులతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్ చెల్లిస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- నోటిఫికేషన్ ప్రకటన - మిదానీ, కంచన్ బాగ్, హైదరాబాద్
- మొత్తం అప్రెంటిస్ ఖాళీలు - 210
- ఖాళీల వివరాలు :ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్- 160, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 30, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ - 20. ఆయా ట్రేడుల వారీగా ఈ ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.
- దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో లేదా ట్రేడ్ లో డిప్లొమా, డిగ్రీ , ఐటీఐ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.9,600 స్టైఫండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్‌కు రూ.10,900గా ఉంటుంది.
- వయోపరిమితి - 30 ఏళ్ల లోపు ఉండాలి.
- దరఖాస్తు విధానం - అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మిదానీ వెబ్ సైట్ లో మీ వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్ట్రేషన్ కాపీని “అడిషనల్ జనరల్ మేనేజర్, ట్రైనింగ్ అండ్ డెవెలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, మిధానీ, కంచన్‌భాగ్, హైదరాబాద్ -50008” చిరునామాకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ - 10 డిసెంబర్ 2025
{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు