ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర తేదీలను దేవస్థానం పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 17 నుండి 20 వరకు నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మహా మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తుంది.
మేడారం జాతర 2026
{{^htLoading}} {{/htLoading}}
అయితే రెండేళ్ల మధ్యలో వచ్చే ఏడాది భక్తుల కోరిక మేరకు మేడారం పూజారులు సాంప్రదాయబద్ధంగా మినీ జాతర లేదా మండ మెలెగె క్రతువును నిర్వహిస్తారు. సమ్మక్క-సారలమ్మ మేడారం దేవాలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపిన వివరాల ప్రకారం, గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాల నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 17 (మొదటి రోజు): గుడి శుద్ధి, అమ్మవార్ల ప్రత్యేక పూజలు, 'గ్రామ నిర్బంధం' ఆచార క్రతువులను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 18 (రెండో రోజు): సమ్మక్క, సారలమ్మల దేవతలను పసుపు, కుంకుమలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఫిబ్రవరి 19, 20 (మూడు, నాలుగో రోజులు): ప్రధాన 'మండ మెలెగె' ఉత్సవాలు జరుగుతాయి.
'మన గిరిజన సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారమే సమ్మక్క-సారలమ్మ తల్లివర్లకు పూజలు నిర్వహిస్తాం. మండ మెలెగెలో భాగంగా గ్రామీణులందరూ కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరుస్తారు. ఈ రోజులన్నింటిలో భక్తులకు అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఉంటుంది.' అని మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు చెప్పారు.
మహా జాతర స్థాయిలో గద్దెలపైకి అమ్మవార్లను తీసుకురానప్పటికీ, గుడిలోనే అమ్మవార్లను పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఈ మినీ జాతరకు విచ్చేస్తారు. భక్తులకు ఈ మినీ జాతర ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.