రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం.. 8 లైన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ - మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో రూ.60.799 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. రూ.10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూ.36,000 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా అన్ని జిల్లాలను అనుసంధానించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇక విజయవాడ - హైదరాబాద్ విస్తరణ పనులపై కూడా మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రూ.10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ హైవేను 4 లైన్ల నుంచి 8 లైన్లుగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.
గ్రామీణ రోడ్ల అనుసంధానం కోసం రూ.11,399 కోట్ల విలువైన హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి చెప్పారు. రూ. 8,000 కోట్లతో 52 కి.మీ నిర్మించబోయే మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన దశలో ఉందన్నారు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్టు వరకు రూ. 20,000 కోట్లతో కొత్త వాణిజ్య కారిడార్‌ను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందన్నారు.
ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలోని రోడ్ల పురోగతిని స్వయంగా సమీక్షిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అనుమతుల కోసం కేంద్ర మంత్రులతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

