పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ విషయంలో పొరపాటు జరిగిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ ఎస్ఈ మల్లికార్జున్ నిర్లక్ష్యం వల్లే పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా అధికారులను పెట్టుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తోందన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు.
ఎస్ఈ పై కోమటిరెడ్డి ఫైర్

ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోయేందుకు అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ విషయం తెలిసినా నాగార్జున సాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాబట్టే తమకు చెప్పలేదని ఆరోపించారు. ఆంధ్రా వ్యక్తిని సాగర్ ఎస్ఈగా కొనసాగించడం తమ పొరపాటేనని అన్నారు. ఈ వ్యవహారంపై ఎస్ఈ మల్లికార్జున్ను నిలదీశానని…. ఫోన్ చేసి లీవ్ పెట్టడం కాదు, రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించానని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు కుట్ర చేయటం వల్లే ఈ మోసం జరిగిందన్నారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కోమటిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు.కాంగ్రెస్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఎల్బీసీప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టుదలతో పూర్తి చేస్తుందని…. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని కోమటిరెడ్డి ప్రకటించారు.
Also Read కృష్ణా జలాల వాటాలో మరణ శాసనం రాసిందే కాంగ్రెస్.... CM రేవంత్ పై హరీశ్ రావ్ ఫైర్Also Read కృష్ణా జలాల పంపిణీ వివాదం : తెగని ఏపీ, తెలంగాణ వాటాలు - KRMB ఏం చేయబోతుంది..?ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.