...
...
Next Story

కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మరణించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నట్టుగా మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

Updated on: Nov 1, 2025, 22:17:47 IST
Advertisement

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. రెయిలింగ్ ఊడిపడి ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. చాలా మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆ తర్వాత ఘటన స్థలానికి వెళ్లారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని లోకేశ్ వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి లోకేశ్
ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి లోకేశ్

ఘటన జరిగిన తర్వాత మంత్రి నారా లోకేశ్ బయలుదేరి కాశీబుగ్గ వచ్చారు. ఘటన స్థలంతోపాటుగా పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చులో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారని లోకేశ్ అన్నారు. ఇంత మంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. బారికేట్లు ఏర్పాటు చేసినా రద్దీ కారణంగా సరిపోలేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే.. మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారన్నారు.

'ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మించారు. తొక్కిసలాట ఘటన మీద ఆలయ నిర్వాహకులు, సిబ్బందిని విచారణ చేస్తాం. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 16 మందికి ప్రాణాపాయం లేదు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తాం.' అని లోకేశ్ తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదన్నారు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe