...
...
Next Story

TG Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మోక్షం - మే నెలాఖరుకల్లా కేటాయింపులు..!

TG Govt Double Bedroom Houses : అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను మే నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించన్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.

Published on: Apr 30, 2026, 19:55:26 IST
Advertisement

TG Govt Double Bedroom Houses : రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవి స్థాయిలో కూడా ఉన్నా కూడా మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (ఫైల్ ఫొటో)
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (ఫైల్ ఫొటో)

నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అంసపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి… తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న 2 బీహెచ్‌కే లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల చేస్తామన్నారు.

గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని…. విద్యుత్, మంచినీటి, డ్రైనేజి, రోడ్లు వంటి కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారని….. వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని.. అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు.

2 బీహెచ్‌కే బిల్లుల చెల్లింపుల్లో, అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ తో సరిపెట్టమని మంత్రి తేల్చి చెప్పారు. సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 దరఖాస్తు ఇప్పుడు చేశారు, అప్పుడు చేశారనేది ముఖ్యం కాదనీ పేదరికమే అర్హతని స్పష్టం చేశారు. అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని అన్నారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందచేస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే లబ్దిదారుల ముసుగులో అక్కడక్కడా దుర్వినియోగం అవుతున్నదన్న సమాచారం ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అర్హులకు ఇసుక అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆచరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఒక పాలసీని రూపొందించాలని సూచించారు. న

ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి పడబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూములను ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. భూ రికార్డుల్లో పాదర్శకత, ఖచ్చితత్వం తీసుకుని రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఎక్కడా కలపడం కానీ, తీసివేయడం గానీ లేదని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని…. అలాగే ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నామని వీటికి అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్లకు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks