TG Assembly Live : కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు - నీటి ప్రాజెక్టులపై ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నీటి ప్రాజెక్టులపై శనివారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదన్నారు.

గత బీఆర్ఎస్ హయాంలో కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అత్యధిక కృష్ణా నది జలాలను తెలంగాణ రైతాంగం ఉపయోగించిందని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.2024 - 2025 సంవత్సరంలో రాష్ట్ర రైతులు 286.30 TMC నీళ్లను వినియోగించారని వివరించారు. పలు లెక్కలను చూపిస్తూ… వివరించే ప్రయత్నం చేశారు. గోదావరి జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగే పరిస్థితే లేదని… కానీ బీఆర్ఎస్ పెద్దలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై కేంద్రం అపెక్స్ కౌన్సెల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే నాడు కేసీఆర్ వెళ్లలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

