తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి పోరాడుతున్నాం : గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్

పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటి మళ్లింపుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గోదావరి జలాల్లో 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.

Published on: Dec 31, 2025, 21:40:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని మళ్లించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌తో పోరాడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. దీనిని ఇప్పుడు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ (PNLP)గా మార్చారని అని చెప్పారు. 'ఈ ప్రాజెక్టులు 1980 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ఇచ్చిన CWC- TAC క్లియరెన్స్, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నాయని తెలంగాణ నిరంతరం వాదిస్తోంది.' అని ఉత్తమ్ కుమార్ అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫొటో)
ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ప్రణాళికల గురించి తెలుసుకున్న తర్వాత.. కేంద్రానికి లేఖలు పంపినట్టుగా మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఏపీ ఉల్లంఘనల కారణంగా అంచనాలను తిరస్కరించాలని లేఖలో పేర్కొన్నట్టుగా తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వివరణాత్మక చర్యను ఉత్తమ్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిపుణుల అంచనా కమిటీ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకుందన్నారు.

బనకచర్ల, నల్లమల ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కేంద్రానికి లేఖ రాశామని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అనుమతలు ఇవ్వకూడదని కేంద్రాన్ని కోరామన్నారు. ఫలితంగా పర్యావరణ శాఖ ఏపీ ప్రతిపాదనను వెనక్కి పంపిందన్నారు. కేంద్ర జలశక్తి, కేంద్ర జల సంఘం అభ్యంతరాలు తెలిపాయని గుర్తు చేశారు. జులై భేటీలో పోలవరం, బనకచర్ల అజెండాగా చర్చడాన్ని తిరస్కరించామన్నారు. గోదావరి జలాల్లో 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్.

ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఉత్తమ్ విమర్శించారు. 'తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాపాడటానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మా అభ్యంతరాల ఫలితంగా ఈ సంవత్సరం ప్రారంభంలో నిపుణుల కమిటీ తిరస్కరించింది. పోలవరం, నల్లమలసాగర్ డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ పిలవగానే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా కొనసాగకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. వరద జలాలు కేటాయించకుండానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సంప్రదింపులు తప్పనిసరిగా ఉండాలి.' అని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More