Sign in

ఆంధ్రప్రదేశ్ రౌండప్ 2025 : సానుకూల పరిణామాలు.... విషాద ఘటనలు - వీటిపై ఓ లుక్కేయండి

ఈ ఏడాదిలో ఏపీలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు రాజధాని పనులు కొనసాగుతుండగా… ఈసారి విషాదకరమైన రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇక మారేడుమిల్లి కేంద్రంగా కీలక మావోయిస్టు నేతలు కూడా మృతి చెందారు.

Published on: Dec 31, 2025, 13:12:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 ఏడాది ముగిసి.. మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణ కోసం పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పెట్టుబడులను కూడా ఆకర్షించే పనిలో ఉండగా… ఈ ఏడాది కొన్ని విషాధ ఘటనలు కూడా జరిగాయి. ముఖ్యమైన కొన్ని ఘటాలపై ఓ లుక్కేయండి….

ఆంధ్రప్రదేశ్ రౌండప్ 2025 : సానుకూల పరిణామాలు.... విషాద ఘటనలు - వీటిపై ఓ లుక్కేయండి
ఆంధ్రప్రదేశ్ రౌండప్ 2025 : సానుకూల పరిణామాలు.... విషాద ఘటనలు - వీటిపై ఓ లుక్కేయండి
  • మూడేళ్లలో రాజధాని పనులను పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది కీలకమైన పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవలనే హైకోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు.
  • తిరుపతి ఆలయం వద్ద తొక్కిసలాట, సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిపోవడం, కాశిబుగ్గ పుణ్యక్షేత్రంలో రెయిలింగ్ ఇవ్వడం వంటి మూడు ప్రధాన ఆలయ ఘటనలు విషాదం ముగిల్చాయి. ఈ విషాదాల్లో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు.
  • అక్టోబర్ నెలలో కర్నూల్ వద్ద ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు.
  • మొంథా తుఫాన్ దాటికి కనీసం రూ .5,233 కోట్ల నష్టాన్ని కలిగించింది.
  • నవంబర్ లో మారేడుమిల్లి సమీపంలో జరిగిన రెండు వరుస ఎన్ కౌంటర్లలో అగ్రశ్రేణి నక్సలైట్ మాద్వి హిడ్మాతో సహా 13 మంది మావోయిస్టులు మరణించారు.
  • అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో విడత భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • రాష్ట్రంలో మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31వ తేదీతో ఈ జిల్లాలు అమల్లోకి వచ్చాయి. వీటితో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి చేరింది.
  • విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల ఏఐ గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా వచ్చిన రూ .13 లక్షల కోట్లకు పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టాలెక్కాల్సి ఉంది.
  • తల్లికి వందనం (పాఠశాలకు వెళ్లే పిల్లవాడికి రూ .15,000) మరియు అన్నదాత సుఖీభవ (అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ .20,000) స్కీమ్ పట్టాలెక్కింది.
  • 10 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తీవ్రంగా పోరాటం చేస్తోంది. కోటి మందికి పైగా సంతకాలను సేకరించి… గవర్నర్ కు కూడా కాపీని అందజేస్తోంది.
  • ఏపీ డీఎస్సీని పూర్తి చేయటం ద్వారా కొత్త టీచర్లు విధుల్లో చేరారు.
  • మహిళకు ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ అమల్లో ఉంది.
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సుమారు 3 లక్షల మంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
  • ఇక అమరావతి దార్శనికతను సాకారం చేయడానికి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనకు 2026 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాజధాని నగర నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట కాలపరిమితితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో 2026లో కీలక పనులు పూర్తి కావాల్సి ఉంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More