అప్పన్నస్వామి భక్తులకు గుడ్‌న్యూస్.. విశాఖ టూ సింహాచలం డబుల్ డెక్కర్ బస్సు ప్రారంభం

సింహాచలం అప్పన్నస్వామి భక్తులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నం నుంచి సింహాచలం వరకు డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ ప్రారంభమైంది.

Published on: Dec 11, 2025, 13:29:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలానికి సూపర్ జర్నీ అనుభూతి కలగనుంది. ఎందుకంటే విశాఖపట్నం నుంచి కొత్త డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. విశాఖపట్నంలో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ గురువారం అధికారికంగా ప్రారంభమైందని పర్యాటక శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ సేవ నగర పర్యాటకులకు, సింహాచలం అప్పన్న స్వామి ఆలయం దర్శనం వెళ్లే భక్తులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

డబుల్ డెక్కర్ సర్వీస్
డబుల్ డెక్కర్ సర్వీస్

ఈ సర్వీస్‌ను ప్రవేశపెట్టడంతో పర్యాటకాన్ని పెంచాలని, ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలలో సులభంగా చేరుకోవడానికి వీలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో చాలాసార్లు ఈ డబుల్ డెక్కర్ బస్సు ట్రయన్ రన్ చేస్తూ కనిపించింది. ఆర్కే బీచ్ నుండి సింహాచలం వరకు మార్గాన్ని కూడా ప్రయత్నించింది.

కాకినాడ-శ్రీశైలం బస్సు

మరోవైపు పలు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. కాకినాడ-శ్రీశైలం నడుమ వయా రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా కొత్త బస్సు సర్వీస్ నెంబర్ 2861ను నడుపుతున్నట్టుగా ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సు కాకినాడ డిపో నుంచి ప్రతిరోజు రాత్రి 7.45కు బయలుదేరి సామర్లకోట, పెద్దాపురం, రంగంపేట, రాజానగరం, రాజమహేంద్రవరం మీదుగా వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలం నుంచి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 8.15కు కాకినాడ చేరుకుంటుంది.

ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీల తగ్గింపు

శ్రీకాకుళం నుంచి విజయవాడ మార్గంలో తిరిగే ఇంద్రా ఏసీ బస్సు ఛార్జీలు తగ్గింపును డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టుగా ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. శ్రీకాకుళం-విజయవాడ మార్గంలో నడిపే ఇంద్ర ఏసీ బస్సుల ఛార్జీలు 20 శాతం మేర తగ్గిస్తుంది. ఇది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండనుంది. ప్రస్తుత ఛార్జీ రూ.928 నుంచి రూ.743కు అవుతుంది. శ్రీకాకుళం నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు, విజయవాడ నుంచి ప్రతీ రాత్రి 7.15 గంటలకు బస్సు బయలుదేరుతుంది.

అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ పలు డిపోల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. శబరిమల, అరుణాచలం వెళ్లాలి అనుకునేవారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వివరాల కోసం దగ్గరలోని డిపోను సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More