...
...
Next Story

బాగున్నారా.. అమ్మా..! కేసీఆర్ నివాసానికి వెళ్లిన మహిళా మంత్రులకు ఆత్మీయ పలకరింపు

ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ వెళ్లారు. మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. తన నివాసానికి వచ్చిన మహిళ మంత్రులను.. ‘బాగున్నారా.. అమ్మ’ అంటూ కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు.

Published on: Jan 8, 2026, 18:14:19 IST
Advertisement

మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓవైపు ఆధునీకరణ పనులు కొనసాగుతుండగానే… మరోవైపు భక్తుల రద్దీ మొదలైంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానంగా అందగా… ఇవాళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. రాష్ట్ర మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క… స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి జాతరకు రావాలని ఆహ్వానించారు.

కేసీఆర్ నివాసానికి మహిళా మంత్రులు
కేసీఆర్ నివాసానికి మహిళా మంత్రులు

ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న మహిళా మంత్రులకు… మాజీ ఎంపీ సంతోష్ రావు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసిన మంత్రులు… కాసేపు మాట్లాడారు. మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు.

ఆత్మీయ పలకరింపు…

ఇంటికి వచ్చిన మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి సాదర ఆహ్వానం లభించింది. ‘బాగున్నారా…. అమ్మ’ అంటూ మంత్రులకు కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం చేశారు.

కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు… కాసేపు పరస్పర యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks