సర్పంచుల చేతుల్లోకి ‘గ్రామ పాలన’ పగ్గాలు - రేపే ప్రమాణస్వీకారాలు..!
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. దీంతో కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నిక పూర్తి అయింది. వీరంతా కూడా రేపు(డిసెంబర్ 22) ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా ముగించారు. కొత్త సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావటంతో… వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

సోమవారం ప్రమాణస్వీకారాలు…
సోమవారం(డిసెంబర్ 22) నుంచి కొత్త సర్పంచ్ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులతో కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. దీంతో ప్రత్యేకాధికారుల పాలన ముగిసినట్లు అవుతుంది. వీరి ప్రమాణస్వీకారాలకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పంచాయతీ కార్యదర్శులు… ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ తేదీనే (డిసెంబర్ 22) కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ఈ నెల 17 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరోవైపు కొత్త పాలకవర్గం రావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే వీటిలో ఫలితాలు తేలిపోయాయి. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్రంలోని 32 గ్రామపంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.
2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా.. అప్పట్నుంచే ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో… ప్రభుత్వ వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మూడో విడతల్లో ఈ ఎన్నికలను పూర్తి చేసింది.
రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. వాటికి 2024 జనవరిలో పదవీకాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఎన్నికల నిర్వహణ కుదరలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… బీసీలకు రిజర్వేషన్లను 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కుల గణన కూడా నిర్వహించింది.
ఈ ఏడాది సెప్టెంబరు 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వేర్వరు పిటిషన్లు దాఖలు కావటంతో… అక్టోబరు 9న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకుండా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంతో పాటు హైకోర్టు స్పష్టం చేసిది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

