రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం!
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండో విడత పోరులోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది.
తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపించింది.

తెలంగాణ రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్ఈసీ ప్రకటించింది. 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వార్డు సభ్యుల పదవులకు 71,071 మంది పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి చేశారు.
54,40,339 మంది అర్హత కలిగిన ఓటర్లలో 46,70,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 85.86 శాతం పోలింగ్ నమోదైందని పత్రికా ప్రకటనలో ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్ పీటీఐకి తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2297, బీఆర్ఎస్ మద్దతుదారులు 1191, బీజేపీ 257, ఇతరులు 578 స్థానాల్లో గెలిచారు.
డిసెంబర్ 11న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రెండో దశ కూడా అయిపోయింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాదరణకు పరీక్షగా మారాయి. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ చర్య చుట్టూ చాలా రోజులు రాజకీయం నడిచింది. కోర్టుల్లో కేసులు నడిచాయి. చివరకు కుదరదనడంతో ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. చట్టపరమైన అడ్డంకుల కారణంగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మాత్రం వాయిదా వేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


