తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : ముగిసిన మొదటి విడత పోలింగ్ - ఓట్ల లెక్కింపు షురూ

రాష్ట్రంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. 189 మండలాల్లోని 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Published on: Dec 11, 2025, 14:22:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా… మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. భోజన విరామం పూర్తి కావటంతో… మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.

మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

మరోవైపు పోలింగ్ సమయం ముగిసినా కొన్నిచోట్ల ఓటర్లు బారులు తీరి ఉన్నారు. గేట్లు వేసి మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం… మొదటి విడత కింద ఇవాళ 189 మండలాల్లోని 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా… మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదట ఉప సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేస్తారు. గెలిచిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు.

మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భారీ ఎత్తున తరలిరావటంతో… చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు కనిపించాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ రద్దీ కనిపించింది.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు పట్టిష్టమైన చర్యలు చేపట్టారు. ఇక ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చూస్తున్నారు. రౌండ్ టు రౌండ్ ఓట్ల ఫలితాలను వెల్లడించనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More