TG New Voter Registration : మీకు 18 ఏళ్లు నిండాయా..? ఓటరు లిస్టులో పేరు నమోదుకు అవకాశం, ఇలా చేయండి

Telangana New Voter Registration : తెలంగాణలో 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం 'ఫాం-6' దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

Published on: Jul 6, 2026, 11:56:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఓటరు హక్కును సాధించాలనుకునే యువతకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO Telangana) కార్యాలయం ఒక కీలక సమాచారాన్ని విడుదల చేసింది. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న ప్రతి కొత్త ఓటరు కూడా ప్రస్తుతం ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది కాబట్టి…. అర్హులైన యువతీయువకులు ఎవరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఓటరు లిస్టులో పేరు నమోదుకు మంచి అవకాశం!
ఓటరు లిస్టులో పేరు నమోదుకు మంచి అవకాశం!

పేరు నమోదు ఇలా….

18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం "ఫాం 6" (Form 6) ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫాం-6 దరఖాస్తుతో పాటు ఒక డిక్లరేషన్ ఫారాన్ని కూడా జతపరిచి ఎన్‌రోల్‌మెంట్ కోసం సమర్పించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన ఖాళీ ఫారాలను మీ ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) స్వయంగా ఉచితంగా అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా నాలుగు సరళమైన దశల్లో పూర్తవుతుంది.

  • దరఖాస్తు చేసుకునేందుకు ఓటరు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలియ
  • బీఎల్ఓ ఇచ్చిన ఫాం-6, డిక్లరేషన్ ఫారంలో అడిగిన వివరాలన్నింటినీ తప్పులు లేకుండా భర్తీ చేయాలి.
  • పూర్తి చేసిన ఆయా దరఖాస్తు ఫారాలను తిరిగి మీ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) కే సమర్పించాల్సి ఉంటుంది.
  • ఆ దరఖాస్తులను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
  • ఈ దరఖాస్తుల పరిశీలన కాలపరిమితిని కూడా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ క్లెయిమ్స్ మరియు అబ్జెక్షన్స్ పీరియడ్ లో భాగంగా పరిశీలిస్తారు.
  • ఈ ప్రత్యేక పరిశీలన ప్రక్రియ 2026 జూలై 31 నుంచి 2026 ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది.
  • అధికారులు మీ దరఖాస్తును ఆమోదించిన తర్వాత, కొత్త ఓటరు పేరు అధికారికంగా తుది ఓటరు జాబితాలో (Final Electoral Roll) చేర్చబడుతుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More