Voter Enumeration : ఓటరు ఇంట్లో లేకపోయినా నో టెన్షన్ - ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు
Voter Enumeration : బీఎల్ఓ (BLO) సర్వే సమయంలో ఓటరు ఇంట్లో అందుబాటులో లేకపోయినా ఎన్యూమరేషన్ ఫారమ్‌ను సమర్పించవచ్చు. కుటుంబంలోని ఏ ఒక్క వయోజనుడైనా ఈ ఫారమ్‌ను భర్తీ చేసి ఇవ్వవచ్చు.
Voter Enumeration : తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ, నిరంతర ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. అయితే….. బీఎల్ఓలు వచ్చే సమయంలో చాలా మంది ఉద్యోగ రీత్యా లేదా ఇతర పనుల వల్ల ఇళ్లలో ఉండటం లేదు. అటువంటి సమయంలో తమ వివరాలను ఎలా నమోదు చేయించుకోవాలనే గందరగోళం ఓటర్లలో నెలకొంది. దీనిపై ముఖ్య ఎన్నికల అధికారి (CEO) - తెలంగాణ స్పష్టతనిస్తూ ఒక ప్రత్యేక మార్గదర్శకాన్ని విడుదల చేశారు.

ఓటరు ఇంట్లో లేకపోయినా ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగిపోదని…. కుటుంబ సభ్యుల సహకారంతో దీనిని సులభంగా పూర్తి చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
- బీఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు ఓటరు వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- ఓటరు తరపున కుటుంబంలోని ఏ ఒక్క వయోజన సభ్యుడైనా (Adult Member - 18 ఏళ్లు పైబడిన వారు) బీఎల్ఓ నుండి ఎన్యూమరేషన్ ఫారమ్‌ను స్వీకరించవచ్చు.
- ఆ కుటుంబ సభ్యుడు ఓటరు యొక్క పూర్తి వివరాలను ఆ ఫారమ్‌లో జాగ్రత్తగా పూరించి, చివరలో తన సంతకాన్ని (Signature) చేయాల్సి ఉంటుంది.
- పూర్తిగా నింపిన, సంతకం చేసిన ఆ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తిరిగి అక్కడికక్కడే బీఎల్ఓకు అందజేయాలి.
ఈ నిబంధనల ప్రకారం….. ఓటరు స్వయంగా సంతకం చేయకపోయినా.. వారి తరపున కుటుంబ సభ్యులు ధృవీకరించి ఇచ్చే ఫారమ్ పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. దీనివల్ల ఎవరూ తమ ఓటు హక్కు నమోదును కోల్పోయే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలందరూ ఇళ్ల వద్దకు వచ్చే బీఎల్ఓలకు సహకరించి, ఓటర్ల జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: బీఎల్ఓ వచ్చే సమయానికి ఓటరు ఇంట్లో లేకపోతే ఏం చేయాలి?
జవాబు: ఓటరు అందుబాటులో లేనప్పుడు, వారి తరపున కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడైనా ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తీసుకొని, వివరాలు నింపి సమర్పించవచ్చు.
ప్రశ్న: ఎన్యూమరేషన్ ఫారమ్‌పై ఓటరు సంతకం కచ్చితంగా ఉండాలా?
జవాబు: ఓటరు లేనప్పుడు కుటుంబ సభ్యులే వివరాలు పూరించి, ఆ ఫారమ్‌పై సంతకం చేసి బీఎల్ఓకు ఇవ్వవచ్చు. అది పూర్తిగా చెల్లుతుంది.
ప్రశ్న: కుటుంబంలో ఎవరు ఈ ఫారమ్‌ను పూర్తి చేయడానికి అర్హులు?
జవాబు: కుటుంబంలోని 18 ఏళ్లు పైబడిన ఏ వయోజన సభ్యుడైనా ఓటరు తరపున ఈ ఫారమ్‌ను పూరించి, సంతకం చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

