SIR in Telangana : మీ 'ఎన్యూమరేషన్ ఫామ్' ఇంకా రాలేదా..? సందేహాలుంటే ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి!

తెలంగాణలో ఓటర్ల జాబితా నమోదు, ధృవీకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫామ్ అందని వారు ఆన్‌లైన్ ద్వారా లేదా తమ ప్రాంత బీఎల్ఓను సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవచ్చు. సాంకేతిక ఇబ్బందులుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు

Published on: Jun 30, 2026, 12:22:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మీ 'ఎన్యూమరేషన్ ఫామ్' ఇంకా రాలేదా?
మీ 'ఎన్యూమరేషన్ ఫామ్' ఇంకా రాలేదా?

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనది. ఓటర్ల జాబితాలో మీ పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అయితే…. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన 'ఎన్యూమరేషన్ ఫామ్' (Enumeration Form) ఇంకా మీకు అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్లు తమ ఫామ్‌ను సులభంగా పొందేందుకు ఎన్నికల సంఘం మూడు ముఖ్యమైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఫామ్ కోసం ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • ఆన్‌లైన్ ద్వారా: ఒకవేళ మీకు ఎన్యూమరేషన్ ఫామ్ భౌతికంగా అందకపోతే, మీరు నేరుగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.in ను సందర్శించవచ్చు. అక్కడ ఆన్‌లైన్ లోనే మీ ఎన్యూమరేషన్ ఫామ్‌ను పూర్తి చేసి సమర్పించే సదుపాయం ఉంది.
  • బీఎల్ఓను సంప్రదించడం ద్వారా: మీ పరిధిలోని బూత్ స్థాయి అధికారిని (BLO) కలిసి మీ ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఇవ్వాల్సిందిగా కోరవచ్చు. వారు మీ వివరాలను నమోదు చేయడంలో పూర్తి సహాయం అందిస్తారు.
  • బీఎల్ఓ వివరాలు తెలుసుకోవడం ఎలా?: మీ ప్రాంతానికి సంబంధించిన బీఎల్ఓ ఎవరో మీకు తెలియకపోతే, తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in ను సందర్శించి మీ బూత్ స్థాయి అధికారి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మీ పేరు ఎలాంటి తప్పులు లేకుండా భద్రంగా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి భరోసా ఇస్తుంది. గుర్తుంచుకోండి.. ప్రతి ఫామ్ ఎంతో కీలకం, ప్రతి ఓటూ ఎంతో విలువైనది.

హెల్ప్‌లైన్ నంబర్

ఎన్యూమరేషన్ ఫామ్ నింపడంలో లేదా ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి సందేహాలున్నా, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా ఓటర్లు వెంటనే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. దీనితో పాటు ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన 'బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ' (Book a Call with BLO) సేవను ఉపయోగించుకొని కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More