ఓటర్లకు అలర్ట్.... మీకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అందలేదా...? అయితే ఇలా చేయండి!

SIR in Telangana : ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫామ్ (EF) కీలకంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫామ్ అందకపోతే ఏం చేయాలో తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published on: Jun 23, 2026, 07:22:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SIR in Telangana : తెలంగాణలో ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) ఎంతో కీలకం. అయితే, చాలామంది ఓటర్లకు ఈ ఫామ్ ఎలా పొందాలో, ఒకవేళ ఇంటికి రాకపోతే ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ఓటర్లలో అవగాహన కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం సంయుక్తంగా కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి.

ఓటర్లకు అలర్ట్.... మీకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అందలేదా...? అయితే ఇలా చేయండి!
ఓటర్లకు అలర్ట్.... మీకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అందలేదా...? అయితే ఇలా చేయండి!

ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అందకపోతే ఇలా చేయండి...!

  • నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా : సాధారణంగా ఎన్యూమరేషన్ ఫామ్ (EF)ను మీ పరిధిలోని బూత్ స్థాయి అధికారి (BLO) నేరుగా మీ ఇంటికి వచ్చి అందిస్తారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల బీఎల్ఓ మిమ్మల్ని సంప్రదించలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్లు నేరుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in నుండి ఈ ఫారాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఇంట్లో లేకపోయినా ఇబ్బంది లేదు : బీఎల్ఓ మీ ఇంటికి వచ్చిన సమయంలో మీరు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు. ఆ సమయంలో మీ ఇంట్లో ఉండే ఏ రకమైన వయోజన సభ్యునికైనా (కుటుంబంలోని పెద్దలు లేదా అర్హులైన ఇతరులు) బీఎల్ఓ ఈ ఫారమును అందజేస్తారు. వారి ద్వారా మీరు ఫారమ్‌ను సేకరించి పూర్తి చేయవచ్చు.
  • ఫోన్ ద్వారా బీఎల్ఓను సంప్రదించవచ్చు : పైన పేర్కొన్న రెండు పద్ధతుల్లోనూ మీకు ఫామ్ లభించకపోతే, ఓటరు నేరుగా తన బూత్ స్థాయి అధికారి (BLO)కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇందుకోసం కేటాయించిన ప్రత్యేక సంప్రదింపు నంబర్ ద్వారా బీఎల్ఓను సంప్రదించి, మీ ఎన్యూమరేషన్ ఫామ్‌ను కోరవచ్చు.

సాంకేతికతను వాడుకుంటూ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఓటర్లు అధికారిక వెబ్‌సైట్ ( https://voters.eci.gov.in ) సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న "Book a Call with BLO" అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా బీఎల్ఓతో నేరుగా మాట్లాడేందుకు సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. ఓటర్లందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తరుచుగా అడిగే ప్రశ్నలు :

ప్రశ్న: ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అంటే ఏమిటి, దీన్ని ఎవరు ఇస్తారు...?

జవాబు: ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణ కోసం ఉపయోగించే ఫారమే ఎన్యూమరేషన్ ఫామ్ (EF). దీన్ని మీ ప్రాంతానికి సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) ఇంటికి వచ్చి ఇస్తారు.

ప్రశ్న: బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు నేను ఊళ్లో లేకపోతే ఫామ్ ఎలా అందుతుంది...?

జవాబు: మీరు ఇంట్లో లేని సమయంలో మీ కుటుంబంలోని ఎవరైనా వయోజన సభ్యునికి బీఎల్ఓ ఆ ఫారమును అందజేస్తారు.

ప్రశ్న: ఆన్‌లైన్‌లో ఈ ఫారమ్‌ను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

జవాబు: భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ https://voters.eci.gov.in వెబ్‌సైట్ నుంచి ఈ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More