డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రూ. 5,102 కోట్లు.. న్యూఇయర్‌కు భారీగా లిక్కర్ సేల్స్!
తెలంగాణలో మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక న్యూ ఇయర్ జోష్ కూడా గట్టిగా అయింది. చివరి రెండు రోజులు రూ.750 కోట్ల మద్యం అమ్ముడైంది.
తెలంగాణలో డిసెంబర్ 2025లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తం అమ్మకాలు రూ.5,102 కోట్లకు చేరుకున్నాయి. గతంలో డిసెంబర్ 2023లో మద్యం అమ్మకాలు రూ.4,300 కోట్లు దాటాయి. ఇప్పుడు డిసెంబర్ 30న మాత్రమే మొత్తం మద్యం అమ్మకాలు రూ. 375 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2025 సంవత్సరంలో ఒకే రోజు జరిగిన అత్యధిక అమ్మకం.

2025 చివరి రోజు డిసెంబర్ 31న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల ద్వారా సాయంత్రం సమయానికే దాదాపు రూ. 350 కోట్లకుపైగా సంపాదించింది. డిసెంబర్ చివరి రెండు రోజుల మెుత్తం కలిపితే రూ.750 కోట్ల వరకు అమ్మకాలు ఉన్నాయి. 2023, 2024 డిసెంబర్‌తో పోలీస్తే.. ఈసారి 13 వందల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతి ఇచ్చింది. అమ్మకాలు మరింత భారీగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు పలు రకాల బ్రాండ్ మద్యం ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చు. వేగంగా మారుతున్న వినియోగదారుల అభిరుచులు, యువతలో పెరుగుతున్న మద్యం వినియోగం రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల నుండి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
బోనాలు, దసరా, నూతన సంవత్సర పండుగల సమయంలో రాష్ట్రంలో మద్యం వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు కూడా డిసెంబర్ నెలలో భారీగా అమ్మకాలు జరిగాయి.
లైసెన్స్ పొందిన అన్ని మద్యం దుకాణాలు ఎంఆర్పీని కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా NDPL (నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్) అమ్ముతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో NDPL మద్యం అమ్మకాలు, ఎంఆర్పీ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి ఆ శాఖ బృందాలు మద్యం దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి మద్యం నిల్వలను తనిఖీ చేశాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


