ఉప్పల్ వేదికగా 'మెస్సీ' ఫుట్‌బాల్ మ్యాచ్‌ : పాస్ లేకుంటే నో ఎంట్రీ - రాచకొండ పోలీసుల ప్రకటన

ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ మెస్సీ ‘గోట్‌’ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ పై రాచకొండ పోలీసులు కీలక ప్రకటన చేశారు. పాస్‌ లేకుంటే అనుమతి లేదని స్పష్టం చేశారు.

Published on: Dec 12, 2025, 11:38:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈనెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి– మెస్సీతో ఉప్పల్‌ మైదానంలో మెస్సీ– గోట్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మ్యాచ్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో…. పోలీసులు కీలక ప్రకటన చేశారు.

మెస్సి – గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ - రాచకొండ పోలీసులు కీలక ప్రకటన
మెస్సి – గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ - రాచకొండ పోలీసులు కీలక ప్రకటన

టికెట్ లేదా పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని… పాస్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీపీ తెలిపారు. దేశం నలుమూలల నుంచి అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో… మ్యాచ్ కోసం భారీబందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అభిమానులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

డీజీపీ సమీక్ష…

ఉప్పల్ మ్యాచ్ ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమీక్షించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా మరియు సమగ్ర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రేక్షకుల భద్రత, సౌకర్యాల మెరుగుదల, ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజా మార్గదర్శకాల విస్తృత ప్రచారంపై సంబంధిత శాఖలకు డిజిపి దిశానిర్దేశం చేశారు.

స్టేడియం సెక్యూరిటీ అనుకూలతలు, 39,000 సీట్ల సామర్థ్యాన్ని అధికారులు వివరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More