రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 77 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వీటిలోప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలున్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లయ్ చేసుకోవచ్చు, https://gmcrajannasircilla.org/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పొందుపరిచారు.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రభుత్వ మెడికల్ కాలేజీ, రాజన్న సిరిసిల్ల
- ఉద్యోగ ఖాళీలు - 77
- ఖాళీల వివరాలు - సీనియర్ రెసిడెంట్ 34,అసోసియేట్ ప్రొఫెసర్ - 19,అసిస్టెంట్ ప్రొఫెసర్ - 14,ప్రొఫెసర్ - 10
- సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలను gmcrajannasircilla.org వెబ్ సైట్ లో పొందుపరిచారు.
- మొత్తం 22 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వీటిలో సీనియర్ రెసిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి.
- దరఖాస్తు చేసుకునే వారి వయసు… 2025 అక్టోబర్ 1వ తేదీ నాటికి 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.
- ఎంపికై వారికి నెలకు రూ. 1 లక్ష నుంచి రూ. 1,90,000 వరకు చెల్లిస్తారు. పోస్టును బట్టి జీతాన్ని నిర్ణయించారు.
- అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. పూర్తి వివరాలతో పాటు ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి.
- దరఖాస్తు చివరి తేదీ - నవంబర్ 22, 2025 సాయంత్రం 5 గంటల వరకు
- ఎంపిక విధానం- ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు.
- ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ చిరునామా నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- నవంబర్ 25వ తేదీన ప్రొవిజినల్ లిస్టును విడుదల చేస్తారు.
- నవంబర్ 26వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు ఉంటాయి.
- నవంబర్ 27వ తేదీన ఎంపికైన వారి తుది జాబితాను ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://gmcrajannasircilla.org/

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}