హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా….. మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 5, 6, 7, 8 తరగతులల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మార్చి 31వతేదీతో ముగుస్తుంది.
రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల్లో 75శాతం సీట్లు మైనార్టీలకు, 25శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వు చేశారు. అభ్యర్థులు https://tgmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మైనార్టీ విద్యార్థులకు తొలుత దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. మైనార్టీయేతర విద్యార్థులకు లక్కీడిప్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
తరగతిని అనుసరించి 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కుటుంబ వార్షికా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలుగా ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 040-23437909 ( ఉదయం10:30 నుంచి సాయంత్రం 5:00 గంటలు) ను సంప్రదించవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తులు - మీ వద్ద ఉండాల్సిన వివరాలు:
- అభ్యర్థి పేరుతో పాటు తల్లి, తండ్రి పేరు
- మొబైల్ నెంబర్
- పుట్టిన తేదీ వివరాలు
- ఆధార్ నెంబర్
- ఆదాయ ధ్రువపత్రం
- కుల ధ్రువీకరణపత్రం
- రెసిడెన్షియల్ అడ్రస్
- దివ్యాంగ విద్యార్థులు అయితే సంబంధిత పత్రాలు
- ఇతర వివరాలు