హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి 'వన్-వే' ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాల గురించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
ట్రాఫిక్ మళ్లింపులు - ప్రత్యామ్నాయ మార్గాలు

జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మూసివేత ఈ వన్-వే నిర్వహణలో భాగంగా జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు.
పంజాగుట్ట టు మాదాపూర్ రూట్: పంజాగుట్ట వైపు నుండి మాదాపూర్ వెళ్లే వాహనాలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఫిల్మ్ నగర్ రోడ్ నెం. 45 మీదుగా దారి మళ్లించారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మార్పులను గమనించి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఈ వన్-వే విధానం అమలు తీరును, క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను నగర పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. సీనియర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి ఆయన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రయల్ రన్‌ను విజయవంతం చేయడానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి 150 మంది ట్రాఫిక్ సిబ్బందిని రంగంలోకి దించారు. అంతేకాకుండా భద్రత, అదనపు సహాయం కోసం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బేలగాల సేవలను కూడా వినియోగిస్తున్నారు.
రెండవ విడత ట్రయల్ రన్
హైదరాబాద్ నగర వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను చేపట్టిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో గతంలో ఏప్రిల్ 5వ తేదీన మొదటిసారి వన్-వే ట్రయల్ రన్ నిర్వహించారు. అప్పట్లో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు, వాహనదారుల కష్టాలను అధిగమించి, వాటిని సవరించిన తర్వాతే రెండో విడత ట్రయల్ రన్‌ను ప్రారంభించారు.
{{/usCountry}}ఈ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో గతంలో ఏప్రిల్ 5వ తేదీన మొదటిసారి వన్-వే ట్రయల్ రన్ నిర్వహించారు. అప్పట్లో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు, వాహనదారుల కష్టాలను అధిగమించి, వాటిని సవరించిన తర్వాతే రెండో విడత ట్రయల్ రన్‌ను ప్రారంభించారు.
{{/usCountry}}గతంలోలాగే ఈసారి కూడా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమకు పూర్తిస్థాయిలో సహకరించాలని పోలీసులు కోరారు. అందుకోసం పలు కీలక జంక్షన్లలో ట్రాఫిక్ సైన్‌బోర్డులను (దిశానిర్దేశక బోర్డులను) ఏర్పాటు చేశామని, వాటిని గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు.
వాకర్స్, అత్యవసర వాహనాలకు సంబంధించిన కీలక రూల్స్
ఈ వన్-వే విధానం వల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా, సుదూర ప్రాంతాల వరకు సజావుగా సాగిపోయేలా ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్ రోడ్డు దాటడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇకపై కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే వారు తమ వాహనాలను రోడ్లపై పార్క్ చేయడానికి వీల్లేదని, రోడ్డుపై పార్కింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఈ వన్-వే విధానంపై వాహనదారులు, స్థానిక ప్రజల నుండి పోలీసులు ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నారు. ఈ ట్రయల్ రన్ ఫలితాలు, ప్రజల నుండి వచ్చే స్పందన ఆధారంగానే భవిష్యత్తులో ఈ వన్-వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.