Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 23వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
ఖాళీల వివరాలు

ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ భద్రతా సేవల సంస్థ 'ఫోర్ట్ 9 సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' (Fort 9 Security Services Pvt Ltd) లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 10 ఖాళీలున్నాయి.
- ఉద్యోగ హోదా: ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ)
- పని స్వభావం: సెక్యూరిటీ సూపర్‌విజన్
- మొత్తం ఖాళీలు: 10 పోస్టులు
ఏదైనా డిగ్రీ….
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి 'ఏదైనా డిగ్రీ' ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 26 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 వరకు జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ ఎక్కడంటే..?
అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా లేదా అప్‌డేట్ చేసిన రెస్యూమ్ తో పాటు విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలి. జూన్ 23వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న 'ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో' కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు నేరుగా ఈ కేంద్రానికి చేరుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు కంపెనీ హెచ్ఆర్ (HR) ప్రతినిధిని 9247526978 అనే ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
{{/usCountry}}ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు కంపెనీ హెచ్ఆర్ (HR) ప్రతినిధిని 9247526978 అనే ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
{{/usCountry}}