...
...
Next Story

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు.. ఈ తేదీలోపు అప్లై చేయండి!

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని వివిధ విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది.

Published on: Oct 23, 2025 09:59 PM IST
Advertisement

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో వివిధ విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, ఫిలాసఫీ తదితర విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు
ఓయూ ఆర్ట్స్ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేసి కానీ, నెట్, సెట్ అర్హత కానీ ఉండాలి. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. రెండింటీలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తులను అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు ప్రిన్సిపాల్ కార్యాలయంలో సమర్పించాలి. రెజ్యూమ్‌లో పేరు, చిరునామా, ముబైల్ నెంబర్ , ఇమెయిల్ ఐడీ, విద్యార్హతలు, పీహెచ్‌డీ డిగ్రీ కాపీ ఉండాలి. అన్ని పత్రాలను ధృవీకరించి దరఖాస్తుతో జతపరచాలి.

ఈ పార్ట్ టైమ్ ఉద్యోగం పూర్తిగా తాత్కాలికమైనది, ముందస్తు నోటీసు లేకుండా కూడా తొలగించే అధికారం ఉంటుంది. వేతనం విషయానికొస్తే.. ఉస్మానియ విశ్వవిద్యాలయం ఆమోదించిన రేట్ల ప్రకారం ఉంటుంది. బోధించే తరగతుల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. పార్ట్ టైమ్ లెక్చరర్లు విశ్వవిద్యాలయం నుంచి ఇతర ప్రయోజనాలకు అర్హులు కాదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో రెజ్యూమ్‌ను ఈ నెల 28వ తేదీలోగా ప్రిన్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.oucde.net ని సందర్శించాలి.

వాయిదా పడిన పరీక్షల తేదీ ఖరారు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe