Mahabubabad District : రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. భూ భారతి రికార్డుల్లో పేరును నమోదు చేయడానికి లంచం తీసుకుంటూ  పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు…. విచారణ జరుపుతున్నారు.

Published on: Nov 29, 2025, 09:50:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని ప్రైవేట్ డ్రైవర్ తుప్పాని గౌతమ్ ను కూడా అరెస్ట్ చేశారు.

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ మహేందర్
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ మహేందర్

రూ. 15 వేలు తీసుకుంటూ….

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం….మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల పరిధిలోని ఓ మహిళ తన మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమి గురించి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకుంది.వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి దరఖాస్తుదారు నుంచి తహసీల్దార్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ… ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.

పకడ్బందీగా రంగంలోకి దిగిన అధికారులు… తహసీల్దార్ వీరగంటి మహేందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను తహసీల్దార్ ప్రైవేట్ డ్రైవర్ అయిన గౌతమ్ ద్వారా తీసుకునే క్రమంలో… ఏసీబీ అధికారులు వారిద్దరని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More