తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు భారీ ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా జస్టిస్ నాగరత్న ధర్మసనం మార్చింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, నిందితుడు ప్రభాకర్ రావుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ప్రభాకర్ రావు తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయెుద్దని ఆదేశాలు జారీ చేసింది. రూ.35 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రం లేదా దేశం విడిచి వెళ్లకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. సాక్షులను భయపెట్టడం, ఆధారాలను ట్యాంపర్ చేయడంలాంటి పనులకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడకు వెళ్లకూడదని పేర్కొంది. మెుత్తానికి అరెస్ట్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు మినహాయింపు లభించింది.
ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వద్దని, ఆయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే కస్టడీ విచారణ ఇప్పటికే ముగిసినందున ఆయనను ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఇందులో కీలకంగా వ్యవహరించారు అనే అభియోగాలు ఉన్నాయి. ఎస్ఐబి పరికరాలను దుర్వినియోగం చేయడం, డేటాను ధ్వంసం చేయడం, ప్రైవేట్ వ్యక్తుల సంభాషణలను వినడంలాంటివి ఈ కేసులో సంచలనంగా మారింది.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు ఉన్న సమయంలో ఆయన ఆదేశాల మేరకే ఈ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో అనేక మంది అధికారులు ఉన్నారు. అంతేకాదు అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా సిట్ విచారమ చేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావును సిట్ చాలా ప్రశ్నలు వేసింది. రేవంత్ సర్కార్ ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తుంది.
{{/usCountry}}ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు ఉన్న సమయంలో ఆయన ఆదేశాల మేరకే ఈ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో అనేక మంది అధికారులు ఉన్నారు. అంతేకాదు అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా సిట్ విచారమ చేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావును సిట్ చాలా ప్రశ్నలు వేసింది. రేవంత్ సర్కార్ ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తుంది.
{{/usCountry}}