Hyderabad Traffic : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ.. పార్కింగ్, ట్రాఫిక్ అడ్వైజరీ!
Hyderabad Traffic : ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఉండనుంది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ(10-05-2026) జరగనుంది. దీంతో నగర పోలీసులు ఏర్పాట్లు చేశారు. బస్సుల పార్కింగ్, ట్రాఫిక్ రూట్ అడ్వైజరీ జారీ చేశారు. ప్రయాణికులు ఈ సూచలను పాటించాలని చెప్పారు. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు.

ఆదివారం, మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే బస్సుల కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా బస్సులు ఎక్కడ ఆగాలి? ఎక్కడ పార్కింగ్ చేయాలో వెల్లడించారు.
- నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ మార్గం: ఈ మార్గాల నుండి ఉప్పల్, ఎల్.బి.నగర్ మీదుగా వచ్చే బస్సులు ఉప్పల్ వద్ద ప్రయాణికులను దించాలి.
పార్కింగ్ ప్రదేశాలు: ఐ.ఏ.ఎల్.ఏ (IALA) పార్కింగ్, ఆర్.జీ.ఐ (RGI) స్టేడియం (సామర్థ్యం: 900), ఉప్పల్ భగాయత్ (100), రైల్వే డిగ్రీ కాలేజీ (100), ఆర్.ఆర్.సి(RRC) గ్రౌండ్స్ (100).
అధికారి కాంటాక్ట్ నెంబర్ : నాగరాజు, SHO ఉప్పల్ ట్రాఫిక్ (8712662421).
- నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్గం : బోయిన్‌పల్లి, తిరుమలగిరి మీదుగా వచ్చే బస్సులు ధోబీఘాట్ వద్ద ఆగాలి.
పార్కింగ్ ప్రదేశాలు : బైసన్ పోలో గ్రౌండ్ (800), ధోబీఘాట్ (200), ఇంపీరియల్ గార్డెన్ (50), బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్ (50).
అధికారి కాంటాక్ట్ నెంబర్ : వి. సర్దార్ నాయక్, SHO తిరుమలగిరి ట్రాఫిక్ (8712660624).
- మెహదీపట్నం, మహబూబ్ నగర్, కర్ణాటక మార్గం : రేతిబౌలి, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ మీదుగా వచ్చే బస్సులు నెక్లెస్ రోడ్(సంజీవయ్య పార్క్) వద్ద ఆగాలి.
పార్కింగ్: సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ ( సామర్థ్యం 800).
అదనపు పార్కింగ్ : ఎన్.టి.ఆర్ స్టేడియం (100), బస్ భవన్ (150), నిజాం కాలేజీ (200), పబ్లిక్ గార్డెన్ (150).
అధికారి కాంటాక్ట్ నెంబర్ : ఎస్. మోహన్ కుమార్ (8712660614) లేదా ఎ. శ్రీనివాస్ (8712660617).
- సంగారెడ్డి మరియు హైటెక్ సిటీ మార్గం: జూబ్లీ చెక్‌పోస్ట్, పంజాగుట్ట మీదుగా వచ్చే బస్సులు నల్లగుట్ట వద్ద ఆగాలి.
పార్కింగ్: నెక్లెస్ రోడ్ (800).
అధికారి కాంటాక్ట్ నెంబర్ : ఎస్. మోహన్ కుమార్ (8712660614).
గమనిక
ఒకవేళ పైన చెప్పిన పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోతే, బహిరంగ సభకు వచ్చే వాహనాలను హైదరాబాద్ నగర శివార్లలోనే నిలిపివేస్తారు. డ్రైవర్లు, నిర్వాహకులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ బహిరంగ సభకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి మాట్లాడారు. సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. సభా ప్రాంగణంలో డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. రోడ్ల మీద వాహనాలను పార్కింగ్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


