Telangana Govt : పల్లె ప్రగతికి 99 రోజుల యాక్షన్ ప్లాన్ - తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది..?
TG Govt Praja Palana – Pragati Pranalika : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఇందులో ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. 99 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ లోని మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మార్చే దిశగా ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 6 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏ పని పూర్తి చేయాలో స్పష్టమైన గడువు విధిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థంగా అందించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భవన నిర్మాణాలు, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణం తదితరలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ యాక్షన్ ప్లాన్ లో భాగంగా… ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించబోయే కార్యక్రమాలెంటో ఇక్కడ తెలుసుకుందాం…!
- మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ఐదు దశల్లో ఈ యాక్షన్ ప్లాన్ ను ప్రభుత్వం అమలు చేయబోతుంది.
- ఏప్రిల్ 2వ తేదీన ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తారు.
- ఏప్రిల్ 16వ తేదీన మండలస్థాయిల సమావేశాలు ఉంటాయి.
- మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ఉంటాయి.
- మే 22వ తేదీన జిల్లా స్థాయి సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలుంటాయి.
99 రోజుల యాక్షన్ ప్లాన్ - ఫోకస్ చేసే 10 ప్రధాన అంశాలు:
- పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్
- ఆరోగ్యం
- రోడ్డు భద్రతా
- సంక్షేమం
- చిన్నారుల భద్రతల - యాంటీ డ్రగ్ డ్రవ్
- రైతుల సంక్షేమం, వ్యవసాయం
- విద్య
- యూత్ అండ్ స్పోర్ట్స్
- మహిళల అభ్యున్నతి
- పర్యావరణం
మార్చి 6వ తేదీన అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతాయి. 99 రోజుల పాటు వివిధ శాఖలలో అభివృద్ధి పనులు ప్రారంభించబడతాయని అధికారులు చెబుతున్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని అమలు చేయటంతో పాటు పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

