TG TET 2026 Keys : ముగిసిన తెలంగాణ టెట్ పరీక్షలు - ప్రాథమిక కీలు ఎప్పుడంటే..?
Telangana TET 2026 Keys :తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు ముగిశాయి. మొత్తం 74.81 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 30న ప్రాథమిక కీ విడుదల కానుంది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ - 2026) జూన్ సెషన్ పరీక్షలు ముగిశాయి. సోమవారంతో ఈ ఆన్‌లైన్ పరీక్షల ప్రక్రియ అంతా పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74.81 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

గణాంకాలను పరిశీలిస్తే…. పేపర్-1తో పాటు పేపర్-2లోని సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మిగిలిన వారు గైర్హాజరయ్యారు. జూన్ 16, 17, 18, 19, అలాగే 22వ తేదీల్లో వివిధ సెషన్లలో ఈ పరీక్షలను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) పద్ధతిలో పూర్తి చేశారు.
టెట్ ప్రాథమిక కీలు ఎప్పుడంటే..?
టీజీ టెట్ పరీక్షలు ముగియడంతో ప్రాథమిక కీల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే వీటిని జూన్ 30వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే…. వాటిని జూలై 2వ తేదీ లోపు వెబ్‌సైట్ ద్వారానే ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు గడువులోగా తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత…. జూలై 28 నుంచి 31 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేస్తారు.
టీజీ టెట్ కీలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
- టీజీ టెట్ కీ విడుదలైన తర్వాత అభ్యర్థులు https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ సబ్జెక్టుల వారీగా వివరాలుంటాయి. మీరు హాజరైన సబ్జెక్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ప్రాథమిక కీతో కూడిన మీ సబ్జెక్ట్ పేపర్ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.
ప్రాథమిక కీ, అభ్యంతరాల నమోదుతో పాటు ఫలితాలను కూడా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. కాబట్టి పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ వెబ్ సైట్ ను సంప్రదించి… వివరాలతో పాటు తాజా అప్డేట్స్ ను తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

