ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో చర్చలు సఫలం - బంద్ విరమణ, తెరుచుకోనున్న కాలేజీలు

తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. చర్చలు సఫలు కావటంతో రేపట్నుంచి  బంద్‌ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది.

Published on: Nov 07, 2025 10:11 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రభుత్వం… కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించారు. కాలేజీలతో జరిపిన చర్చలు సఫలం కావటంతో…. రేపట్నుంచి బంద్‌ విరమిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి.

ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం
ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం

ప్రైవేట్ కాలేజీల బకాయిలలో ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని హామీనిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను చర్చిస్తామని వివరించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను ఈనెల 3వ తేదీ నుంచి బంద్‌ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కాలేజీల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు నవంబర్ 8వ తేదీతో నుంచి తెరుచుకోనున్నాయి.

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు:

విద్య అంటే వ్యాపారం కాదని, విద్య అంటే సేవ అని, చదువుల విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతలవారీగా చెల్లించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పునరుద్ఘటించారు.

విద్యా సంస్థలను మూసివేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఎవరినీ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యను వ్యాపారంగా చూడటం తగదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హితవు పలికారు. విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతులు, ఇతర విషయాల్లో చట్టంలోని నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More