Auto Fare Hike : తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు సిఫార్సు.. కొత్త రేట్లు ఇవే!

Auto Rickshaw fares : తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీలను పెంచాలని ఒక కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొత్తగా ప్రతిపాదించిన రేట్లు ఎలా ఉన్నాయో చూడండి.

Published on: Sep 5, 2026, 13:59:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఆటో రిక్షాల ప్రయాణ ఛార్జీలను పెంచాలని రవాణా శాఖ నియమించిన అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కొత్తగా ప్రతిపాదించిన రేట్లతో కూడిన నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే ఛార్జీల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

తెలంగాణలో ఆటో ఛార్జీలు
తెలంగాణలో ఆటో ఛార్జీలు

కమిటీ ప్రతిపాదించిన కొత్త ఆటో ఛార్జీల వివరాలు

కనీస ఛార్జీ మొదటి 1.6 కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ. 30. మొదటి 1.6 కి.మీ. దాటిన తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ. 14. వెయిటింగ్ ఛార్జీలు నిమిషానికి 75 పైసలు. రాత్రి వేళల్లో సాధారణ ఛార్జీ కంటే 50 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది.

ఛార్జీల పెంపునకు కారణాలు

గడిచిన 12 ఏళ్లుగా రాష్ట్రంలో ఆటో ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదని, అందుకే ప్రస్తుతం ఛార్జీలను పెంచడం అనివార్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ సిఫార్సులు చేయడానికి కమిటీ పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుంది.

ఆటో కొనుగోలు ధర, 70శాతం బ్యాంక్ రుణం, డ్రైవర్ నెలవారీ వేతనం (రూ. 25,000), ప్రతిరోజూ ఆటో తిరిగే సగటు దూరం (163.8 కి.మీ) వంటి అంశాలను లెక్కించారు. ఆదాయం ఇచ్చే ప్రతి కిలోమీటరుకు నిర్వహణ ఖర్చు రూ. 13.53గా తేలడంతో ఆ ధర ఆధారంగా కిలోమీటరుకు రూ. 14 వసూలు చేయాలని సూచించారు.

పెట్రోల్/గ్యాస్ ధరలతో పాటు వాహన ఇన్సూరెన్స్, ఇతర వ్యయాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. ఛార్జీల ఖరారుకు ముందు రవాణా శాఖ అధికారులు కేరళ, ఢిల్లీ, కర్ణాటక (బెంగళూరు), మహారాష్ట్ర (ముంబై) రాష్ట్రాల్లోని ఆటో ఛార్జీల విధానాలను సమగ్రంగా అధ్యయనం చేశారు.

ప్రభుత్వ హామీ

మొత్తం 14 డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆగస్టు 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన చర్చల్లో 15 రోజుల్లోగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆటో యూనియన్లు తమ సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నాయి. ఆ మాట ప్రకారమే కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More