...
...
Next Story

పెన్షనర్లకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్

పెన్షనర్ల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు మరింత సౌకర్యంగా ఉండేందుకు జీవిత ధృవీకరణ పత్రాలు సమర్పించే అవకాశం కల్పించింది. ఇంట్లో నుంచే వీటిని అప్‌లోడ్ చేయవచ్చు.

Published on: Oct 29, 2026, 15:08:30 IST
Advertisement

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తమ పెన్షనర్లకు అత్యంత ఉపశమనం కలిగించే వార్తను అందించింది. పెన్షన్ పొందడానికి ఏటా దాఖలు చేయాల్సిన లైఫ్ సర్టిఫికేట్(జీవిత ధృవీకరణ పత్రాలు) ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారం 5.0ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు తమ పరిధి అంతటా ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ డిజిటల్ సౌకర్యం ద్వారా పెన్షనర్లు, ముఖ్యంగా వయోవృద్ధులు, ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు వెళ్లలేని వారు బ్యాంకులు లేదా పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ ఇంట్లో నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా సర్టిఫికేట్ సమర్పించవచ్చు.

ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్, ముఖ గుర్తింపు ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణను సౌత్ సెంట్రల్ రైల్వే అత్యంత సులభతరం చేసింది. దీని కోసం పెన్షనర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. Aadhaar Face RD UIDAI అభివృద్ధి చేసిన యాప్, కేంద్ర ప్రభుత్వం అందించే Jeevan Pramaan App డౌన్లోడ్ చేసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత, పెన్షనర్లు కింది వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న విధంగా పెన్షనర్ పేరు, పెన్షన్ రకం, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సంఖ్య, పెన్షన్ ఖాతా సంఖ్య, మంజూరు చేసిన అధికార సంస్థ, పెన్షన్ అందించే సంస్థ/బ్యాంకు వివరాలను నమోదు చేయాలి.

సాధారణంగా ప్రతి ఏటా నవంబర్ నెలలో పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. గతంలో బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలు లేదా రైల్వే పెన్షన్ ఆఫీసుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఈ డిజిటల్ ప్రచారం ద్వారా సీనియర్ సిటిజన్లు, నడవలేని స్థితిలో ఉన్నవారు తమ నివాసం నుంచే నిమిషాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రైల్వే పెన్షనర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నవంబర్ 30 లోపు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks