...
...
Next Story

ఏపీ - తెలంగాణ వెదర్ అప్డేట్స్ : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - ఈ నెలాఖారులో వర్షాలు...!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దాదాపుగా చలి కాలం పూర్తి కాగా.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఈనెలాఖారులో తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి.

Published on: Feb 15, 2026, 08:35:46 IST
Advertisement

ఏపీ తెలంగాణలో వాతావరణం మారుతోంది. గత కొద్దినెలలుగా చలి తీవ్రత కొనసాగగా… ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. శివరాత్రి రాకతో దాదాపుగా చలి పూర్తి అయినట్లే. ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

ఈ నెలాఖారులో వర్షాలు…

ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్స్
ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్స్

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… తెలంగాణలోని చాలా ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 17-19 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్నిచోట్ల అకాల వర్షాలు పడే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 28 తేదీల్లో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడొచ్చు. ఉరుములతో కూడా గాలులు వీచే అవకాశం ఉంటుంది.ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత ఈ వర్షాలకు సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… ఈ వారమంతా కూడా తెలంగాణలో పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. హైదరాబాద్ సిటీల కూడా ఇదే మాదిరి వెదర్ ఉండనుంది.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో సోమవారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని తెలుస్తోంది. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe