మేడారంలో జాతీయ మహిళా కమిషన్ విచారణ - గ్యాంగ్ రేప్ జరగలేదని నిర్ధారణ....!
మేడారంలో గ్యాంగ్ రేప్ అంటూ వచ్చిన వార్తలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. గురువారం ములుగులో పర్యటించింది. అయితే మైనర్ బాలికపై రేప్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని పేర్కొంది.పోలీసుల నివేదిక అందాల్సి ఉందని తెలిపింది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో సామూహిక అత్యాచారం జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై… జాతీయ మహిళా కమిషన్ (NCW) బృందం క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా NCW బృందం ఫిబ్రవరి 5న ములుగు జిల్లాను సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ (SP) మరియు వివిధ శాఖల అధికారులతో బృందం సమావేశమైంది. అలాగే సోషల్ మీడియాలో ప్రచారమైన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది.

అలాంటి సంఘటన జరగలేదు - NCW
ప్రాథమిక విచారణ ప్రకారం…. మేడారం జాతరలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసుల నుండి పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత…. జాతీయ మహిళా కమిషన్ (NCW) తన తుది నివేదికను సమర్పించనుంది.
"ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ప్రచారం జరుగుతున్న ప్రాంతానికి మేము విచారణ కోసం వచ్చాము. ఇక్కడి జిల్లా ఎస్పీ, కలెక్టర్ మరియు ఇతర అధికారులను కలిసి మాట్లాడాము. ఇక్కడ అలాంటి సంఘటన ఏదీ జరగలేదని.. అదంతా కేవలం ఒక వదంతు మాత్రమేనని మాకు స్పష్టమైంది. ఈ తప్పుడు వార్తను ప్రచారం చేసిన వ్యక్తి…, తాను ఎటువంటి ధృవీకరణ లేకుండానే సమాచారాన్ని పంచుకున్నానని ఒప్పుకుంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రస్తుతానికి అటువంటి సంఘటన ఏదీ జరగలేదు. పోలీసు నివేదిక అందాల్సి ఉంది.. అది త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం" అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా చెప్పారు.
ములుగు పోలీసుల ప్రకటన
"ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే నకిలీ వార్తను మొదటగా శంకర్ అనే వ్యక్తి తన సొంత ఛానెల్‌లో ప్రచురించాడు. ఆ వార్తకు సంబంధించి అతన్ని ఆధారాల గురించి మేము ప్రశ్నించగా… తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పాడు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 సందర్భంగా అటువంటి సంఘటన ఏదీ జరగలేదని ములుగు ఎస్పీ కార్యాలయం స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చింది. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సదరు వ్యక్తికి నోటీసు జారీ చేయబడుతుంది" అని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
సున్నితమైన మరియు ధృవీకరించబడని వార్తలు ప్రజలలో అనవసర భయాందోళనలను కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని… ధృవీకరించని లేదా సంచలనం కోసం సృష్టించే వార్తలను షేర్ చేయవద్దని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

