రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ఇకపై 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్...!
ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఇకపై రైలు బయలుదేరే 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం కానుంది. ఇదే విషయంపై రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం అమలుపై దక్షిణ మధ్య రైల్వే వివరాలను పేర్కొంది.
ప్రయాణికుల ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్, వెయిటింగ్ లిస్టు కష్టాలను అధిగమించేలా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం…. ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం కానుంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అన్ని జోన్లలో అమలు చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అమలు చేయటంపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటి వరకు ట్రైన్ బయలుదేరడానికి 4గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్జును సిద్ధం చేసేవారు. దీంతో ప్రత్యేకించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. టికెట్ బుకింగ్ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఉండకపోయేది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు పది గంటలు ముందుగా చార్ట్ సిద్ధం చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.
ముందుగానే రిజర్వేషన్ ఛార్ట్…
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఉదయం 5.1 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ఇకపై తొలి రిజర్వేషన్ చార్టును ముందురోజు రాత్రి 8 గంటలకే తయారు చేస్తారు.
ఇక మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటల మధ్య, అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరాల్సిన రైళ్లకు 10 గంటలు ముందుగా తొలి రిజర్వేషన్ చార్టును ఫైనల్ చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

