...
...
Next Story

TG Muncipal Elections 2026 : మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్‌, మేయర్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jan 15, 2026 06:57 AM IST
Advertisement

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. మార్గదర్శకాలను కూడా ప్రకటిస్తూ…ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలు

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలకు లోబడే రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఖరారయ్యాయి. ఇక ఆన్ రిజర్వుడ్ కోటాలో మహిళకు 4, జనరల్ కు ఒక స్థానం ఖరారైంది. ఇక బీసీలకు మూడు (జనరల్‌ 2, మహిళలకు 1) కేటాయించారు.

మరోవైపు రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్లను k కూడా ఖరారు చేశారు. ఎస్సీలకు 17 (జనరల్‌-9, మహిళలు-8), ఎస్టీలకు ఐదు సీట్లు (జనరల్‌-3, మహిళలు-2), బీసీలకు 38 స్థానాలు (జనరల్‌-19,మహిళలు-19), మహిళలకు 31 స్థానాలు, అన్‌ రిజర్వుడ్‌ స్థానాలు 30 ఖరారయ్యాయి.

రిజర్వేషన్ల కోసం 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే(ఎస్‌ఈఈఈపీసీ) ప్రకారం ఉన్న గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు.

రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలు సంఘం ఏర్పాట్లపై దష్టిపెట్టింది. ఇటీవలనే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.

ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఉన్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 56,664 మంది మహిళలు ఉన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe