వచ్చే జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే NIC తగు కసరత్తు చేస్తోందన్నారు.
భూదార్ కార్డుల పంపిణీపై ప్రకటన

రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాల్లో సరిహద్దుల, భూధార్ నెంబర్ల కేటాయింపు వంటి ప్రధాన అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి పని పూర్తి చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఐదు గ్రామాలకు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని… స్థానిక ఎన్నికల తర్వాత వాటిని అందజేస్తామని ప్రకటించారు. మిగిలిన 408 గ్రామాల్లో పట్టణ ప్రాంతాలు మినహా 373 గ్రామాల్లో రెండవ విడత కింద సర్వే నిర్వహిస్తామని చెప్పారు. మూడవ విడతగా అన్నిజిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు.
“రాష్ట్రంలో ఇంతవరకు భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణీ దరఖాస్తులకు కూడా మోక్షం కల్పించాం. అధికారం చేపట్టిననాటికి 2.45 లక్షల ధరణీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత మరో నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించి ప్రజల సంతృప్తికి తొలి అడుగు వేశాం” అని మంత్రి పొంగులేటి వివరించారు.
“భూ సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. అధికారంలోకి వస్తే గ్రామాలలో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్దరిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ వారీగా విభజించి జీపీవోలను నియమించడం జరిగింది” అని మంత్రి పేర్కొన్నారు.
“ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్లకింద నిరీక్షించే పరిస్ధితికి స్లాట్ బుకింగ్ ద్వారా తెరదించాం. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు దశల్లో ఈ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టడమేగాక ఆధార్ -ఈ సంతకం కూడా అమలు చేసి ప్రజల డబ్బు, సమయం ఆదా చేశాం. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించాం” అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
హిల్ట్ పాలసీపై నోరుందని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు వారికి నచ్చిన వారికి, ముడుపులు చెల్లించిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారని విమర్శించారు. వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చారని వ్యాఖ్యానించారు. తాము అలా చేయలేదని… పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశామని చెప్పారు. ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టాను త్వరలోనే బయటపెడుతామని ప్రకటించారు.
{{/usCountry}}హిల్ట్ పాలసీపై నోరుందని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు వారికి నచ్చిన వారికి, ముడుపులు చెల్లించిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారని విమర్శించారు. వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చారని వ్యాఖ్యానించారు. తాము అలా చేయలేదని… పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశామని చెప్పారు. ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టాను త్వరలోనే బయటపెడుతామని ప్రకటించారు.
{{/usCountry}}