సరస్వతీ పుష్కరాలు.. కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి!

తెలంగాణలో తొలిసారిగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుస్తున్నాయి.

Published on: May 23, 2026, 06:39:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి టీజీఎస్ఆర్టీసీ ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయి. రూట్‌లకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లను కూడా అందించారు.

సరస్వతీ నది అంత్య పుష్కరాలు
సరస్వతీ నది అంత్య పుష్కరాలు
  • హైదరాబాద్-9959226245
  • నర్సంపేట-9959226293
  • తొర్రూర్-9959226053
  • భూపాలపల్లి-9959226707
  • మణుగూరు-9959225963
  • కరీంనగర్-9959225920
  • మంథని-9959225923
  • హన్మకొండ-9959226049
  • మహబూబాబాద్-9959226054
  • జనగాం-9959226050
  • పరకాల-9959226051
  • నిజామాబాదు-9959226016
  • గోదావరిఖని-9959225922
  • మంచిర్యాల-9959226004

సరస్వతీ నది అంత్య పుష్కరాలను భారీ ఎత్తున అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఘాట్ల పరిసరాల్లో ఎండ దెబ్బ తగలకుండా భారీ టెంట్లు, నిరంతరం చల్లటి గాలినిచ్చే కూలర్లను ఏర్పాటు చేశారు. సరస్వతీ ఘాట్‌తో పాటు ప్రధాన ఘాట్ల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 300కు పైగా తాత్కాలిక గదులను నిర్మించారు. జూన్ 1వ తేదీ వరకు కొనసాగే ఈ పుష్కరాల్లో ప్రతిరోజు సాయంత్రం నదీమ తల్లికి ‘సరస్వతీ నది హారతి’ కార్యక్రమం జరుగుతోంది.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరాలు జరుగుతాయి. ప్రవేశించే మొదటి 12 రోజులను 'ఆది పుష్కరాలు' అని, ఆ రాశి నుంచి నిష్క్రమించే చివరి 12 రోజులను 'అంత్య పుష్కరాలు' అని పిలుస్తారు.

ఆది పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించడం, పితృదేవతలకు తర్పణాలు/పిండప్రదానాలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో.. అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తే అంతే సమానమైన ఫలితాలు, మోక్షం లభిస్తాయని ప్రముఖ సిద్ధాంతులు చెబుతున్నారు.

కాళేశ్వరం దక్షిణ గంగగా పిలిచే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిగా (భూగర్భంలో) ప్రవహించే సరస్వతీ నది కలయికతో ఏర్పడిన మహా పవిత్ర క్షేత్రం (త్రివేణీ సంగమం). భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహిణిగా ఉన్న క్షేత్రాలు రెండే రెండు: ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) – ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం-ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More