ప్రసిద్ధ వేలాంకణి మాత వార్షిక మహోత్సవాల నేపథ్యంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని నూతన టెర్మినల్ చర్లపల్లి నుండి వేలాంకణి మధ్య అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా కేటాయించిన ఈ ప్రత్యేక రైళ్ల సమయ వేళలు, వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

చర్లపల్లి – వేలాంకణి (రైలు నంబరు: 07127): ఈ ప్రత్యేక రైలు సెప్టెంబరు 08, 2026 (మంగళవారం) ఉదయం 07:40 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:10 గంటలకు వేలాంకణి చేరుకుంటుంది.
వేలాంకణి – చర్లపల్లి (రైలు నంబరు: 07128): తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబరు 09, 2026 (బుధవారం) రాత్రి 11 గంటలకు వేలాంకణిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10:15 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకుంటుంది.
ఇరు మార్గాల్లోనూ ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మయిలాడుతురై, నాగపట్నంలో ట్రైన్స్ ఆగుతాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని తరగతుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. వీటిలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ వేలాంకణి మాత ఉత్సవాలకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను సంప్రదించాలని రైల్వే అధికారులు సూచించారు.
రైళ్ల వేళలు మార్పు
సాంకేతిక, నిర్వహణ కారణాల వల్ల హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
{{/usCountry}}సాంకేతిక, నిర్వహణ కారణాల వల్ల హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
{{/usCountry}}హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12728): నిర్ణీత సమయం ఆగస్టు 16, 2026 సాయంత్రం 05:05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు అదే రోజు సాయంత్రం 07:05 గంటలకు హైదరాబాద్ నుండి ఆలస్యంగా బయలుదేరుతుంది.
హైదరాబాద్ – చెన్నై బీచ్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12760): ఆగస్టు 16, 2026 సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు అదే రోజు రాత్రి 07:15 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ సమయ మార్పులను గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.