కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్…. మరికొన్ని ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 8, 11 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. మరికొన్ని రూట్లలో నడిచే రైళ్లను కూడా పొడిగించింది.

Published on: Feb 7, 2026, 17:35:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - నర్సాపూర్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ ను నడపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా మరికొన్ని రూట్లలో ఇది వరకే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించింది.

వన్ వే స్పెషల్ ట్రైన్స్
వన్ వే స్పెషల్ ట్రైన్స్

వన్ వే స్పెషల్ ట్రైన్స్….

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం… ఈనెల 8,11 తేదీల్లో కాకినాడ నుంచి నర్సాపూర్ కు వన్ వే స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కాకినాడ నుంచి (ట్రైన్ నెంబర్ 07510) ఈ స్పెషల్ ట్రైన్… సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6. 40 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు…

కాచిగూడ - నర్సాపూర్ మధ్య నడిచే వన్ వే స్పెషల్ ట్రైన్స్... మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ,అకివీడు భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో 3ఏసీ, చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులను కోరారు.

ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు:

కాకినాడ టౌన్ - మైసూర్ మధ్య (రైల్‌ నెంబర్‌ 07033) నడుస్తున్న ప్రత్యేక రైలును… మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతి సోమ, శుక్రవారం రాకపోకలు సాగిస్తుంది. ఇక మైసూర్‌ – కాకినాడ టౌన్‌ మధ్య రైలును కూడా మార్చి 3వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రతి మంగళ, శనివారం తేదీల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్…. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, యాద్‌గిర్‌, కృష్ణా, రాయచూర్‌, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్‌, అనంతపూర్‌, ధర్మవరం, హిందుపూర్‌, ఎలహంక, బెంగుళూరు సెంట్రల్‌, కెఎస్‌ఆర్‌ బెంగుళూరు, కనిగిరి, మాండ్యా స్టేషన్లలో ఆగుతుంది.

నరసాపూర్ – ఎస్‌ఎంవిటి బెంగళూరుకు మధ్య నడిచే ప్రత్యేక రైలును కూడా పొడిగించారు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఎస్‌ఎంవిటి బెంగళూరు – నరసాపూర్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ ను మార్చి 7వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు పొడిగించారు.ఈ రైళ్ళు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, వంగోల్‌, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంటతో పాటు పలు స్టేష్లలో ఆగుతాయి

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More