రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం - తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం, విశేషాలివిగో

దేశంలో తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లో పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ…ఈ అధునాతన రైలును జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లటం ఈ రైలు ప్రత్యేకత.

Published on: Jan 17, 2026, 15:26:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌లోని హౌడా స్టేషన్ నుంచి అస్సాంలోని గుహవాటికి తొలి సర్వీస్‌ను ప్రారంభించారు. కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకించి ఈ స్లీపర్ ట్రైన్ ఏర్పాటైంది.

తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ప్రత్యేకతలివిగో…

  • ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ 16 కోచ్‌లతో ఉంటుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లటం ఈ రైలు స్పెషాలిటీ. ప్రస్తుతానికి అయితే గరిష్టంగా గంటకు 120-130 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు.
  • అన్నీ ఏసీ బోగీలే కానీ కొన్ని వ్యత్యాసాలుంటాయి. 11 ఏసీ బోగీలు టైర్ 3, నాలుగు టైర్ 2 ఏసీ బోగీలు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి.
  • ప్రపంచ స్థాయి సస్పెన్షన్ సిస్టమ్ తో కూడిన బెర్తులుంటాయి. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
  • ఈ ఆధునాత రైలులో అత్యంత పరిశుభ్రతను పాటిస్తారు. సాంకేతికతో కూడిన ఆధునాతన క్రిమి సంహారక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
  • సమగ్రమైన ఆన్‌బోర్డ్ నిఘా ఉంటుంది. స్వదేశీ కవచ్ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్‌తో కూడిన వ్యవస్థ పని చేస్తుంది.
  • ఆటోమేటిక్ స్లైడింగ్ తలుపులు ప్రయాణం ఉంటుంది. రైలు స్టేషన్‌కు చేరుకున్నప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి.
  • క్యాటరింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి.కామాఖ్య నుంచి హౌరాకు ప్రయాణించే ప్రయాణీకులకు అస్సామీ వంటకాలు వడ్డిస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు తిరుగు ప్రయాణంలో ఉన్నవారితి బెంగాలీ వంటకాలను అందిస్తారు.
  • ఈ రైలు ​థర్డ్ ​ఏసీ సీటు ధర సుమారు రూ.2,300, సెకండ్​ ఏసీలో అయితే రూ.3 వేలు, ఫస్ట్​ ఏసీ అయితే రూ.3,600 ఉండే అవకాశం ఉంటుంది.
  • ఈ ట్రైన్ ద్వారా హౌరా-గువహతి (కామాఖ్య) మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గిస్తోందని రైల్వేశాఖ చెబుతోంది. పర్యాటక రంగానికి కూడా వందే భారత్ స్లీపర్ ట్రైన్ భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తోంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More