...
...
Next Story

TG Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త - రెండో విడత 'రైతు భరోసా' నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్..!

TG Rythu Bharosa 2nd Installment : రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20న భూపాలపల్లి జిల్లా కాటారం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నగదును విడుదల చేస్తారు.

Published on: Apr 18, 2026, 17:56:24 IST
Advertisement

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈనెల 20వ తేదీన (ఎల్లుండి) రెండో విడుత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రైతు భరోసా స్కీమ్
రైతు భరోసా స్కీమ్

ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు.

తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.

రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం…. మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

  • రైతు భరోసా మొదటి విడత: గత నెల 23వ తేదీన ప్రభుత్వం తొలి విడత నిధులను పంపిణీ చేసింది. అప్పుడు ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని అందించారు. దీనికోసం దాదాపు రూ. 3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
  • రైతు భరోసా రెండో విడత: ఎల్లుండి(ఏప్రిల్ 20) జరగబోయే రెండో విడత పంపిణీలో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ విడతలో మొత్తం రూ. 5,653 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe