...
...
Next Story

Secunderabad Mahankali Bonalu 2026 : 'ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలున్నాయి'...రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత

Secunderabad Mahankali Bonalu Rangam 2026 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా నిర్వహించిన 'రంగం' కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.

Published on: Aug 3, 2026, 10:51:07 IST
Advertisement

Secunderabad Mahankali Rangam 2026 : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలు అత్యంత కోలాహలంగా కొనసాగుతున్నాయి. జాతరలో అత్యంత కీలకమైన, భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది.

మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే స్వర్ణలత చెప్పే భవిష్యవాణిని వినేందుకు భక్తులు, నేతలు, అధికారులు భారీ సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు.

భవిష్యవాణి వినిపిస్తూ మాతంగి స్వర్ణలత ప్రజలను, పూజారులను ఉద్దేశించి పలు కీలక హెచ్చరికలు చేశారు. "ఎన్ని ఆపదలు, ప్రమాదాలు వచ్చినా ప్రతిక్షణం ప్రజలను నేనే కాపాడుకుంటున్నాను. కానీ మీరు నా మాటను ఏమాత్రం ఆచరించడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో మూలాలను మర్చిపోతున్నారన్న ఆమె…. "మనుషులు వావివరుసలు లేకుండా ఘోరాలకు ఒడిగడుతున్నారు. అలాంటి వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నాకు సంతోషం లేకుండా చేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకృతి వైపరీత్యాల గురించి వివరిస్తూ… ఈ ఏడాది తీవ్రమైన వర్షాలు కురుస్తాయని స్వర్ణలత స్పష్టం చేశారు. "ఈ ఏడాది కుంభవృష్టిగా వర్షాలు పడతాయి. ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం కుంభవృష్టి మాత్రమే కాదు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వర్ష తీవ్రతకు ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది," అని ప్రజలను అప్రమత్తం చేశారు.

నాకు కంటతడి పెట్టిస్తున్నారు…

ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన ధార్మిక కార్యక్రమాలపై స్పందిస్తూ, "నాకు విగ్రహ ప్రతిష్ట చేస్తే భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. కానీ రాబోయే ఆరు నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ట చేయకపోతే మాత్రం తీవ్ర ప్రాణనష్టం తప్పదు" అని హెచ్చరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks