40 ఏళ్ల అజ్ఞాత జీవితం… జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సమత, డీజీపీ ముందు లొంగుబాటు

సిపిఐ (మావోయిస్టు) సీనియర్ నాయకురాలు కాకరాల సమత అలియాస్ మాధవి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమతపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. 

Published on: Aug 11, 2026, 08:39:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) రహిత దిశగా అడుగులు వేస్తున్న వేళ ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉంటూ నగర ప్రాంతాల్లో మహిళా విభాగాలు, ఇంటెలిజెన్స్, ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకురాలు కాకరాల సమత అలియాస్ మాధవి సోమవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టు నేత సమత
డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టు నేత సమత

ఈ మేరకు తెలంగాణ డిజిపి సి.వి. ఆనంద్ నేతృత్వంలో ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన సిద్ధాంతకర్తల్లో ఒకరిగా, స్టేట్ కమిటీ మెంబర్ (SCM) స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న సమత లొంగుబాటు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని పోలీసులు వెల్లడించారు.

మావోయిస్ట్ అగ్రనేత సమత నేపథ్యం….

కాకరాల సమత స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ నటుడు. ఆయన 1960లోనే రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి వలస వెళ్లారు. సమత చెన్నైలోనే తన విద్యార్హతను కొనసాగించారు. 1985లో చెన్నైలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితురాలై చదువును మధ్యలోనే ఆపేసి సీపీఐ (ఎమ్ఎల్) పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.

పార్టీలో చురుగ్గా పనిచేసిన సమత 1991 నాటికి ఏరియా కమిటీ మెంబర్ (ACM) స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఆమెను 'సెంట్రల్ ఆర్గనైజర్' బాధ్యతలతో హైదరాబాద్‌కు బదిలీ చేశారు. అర్బన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2015లో ఆమెను సౌత్ రీజినల్ బ్యూరో అర్బన్ ఏరియాకు బదిలీ చేసిన పార్టీ నాయకత్వం, పట్టణ ప్రాంతాల్లో మహిళల సమస్యలు, ఇంటెలిజెన్స్ సేకరణ, ప్రచార విభాగాన్ని పర్యవేక్షించే పూర్తి బాధ్యతలను అప్పగించింది. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు పార్టీలో పని చేసిన సమత… ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

రూ. 20 లక్షల పునరావాస రివార్డు అందజేత…

తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన సమతకు రూ. 20 లక్షల బహుమతి మొత్తాన్ని డీజీపీ సి.వి. ఆనంద్ చెక్కు రూపంలో అందజేశారు. దీనికి అదనంగా తక్షణ సాయం కింద రూ. 25,000 నగదును కూడా అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లొంగిపోయిన కేడర్‌కు అందే అన్ని రకాల సంక్షేమ ఫలాలను, పునరావాస ప్రయోజనాలను ఆమెకు కల్పిస్తామని పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం నామమాత్ర స్థాయికి చేరిందని పోలీసులు స్పష్టం చేశారు. 2026 నాటికి తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 265 మంది మావోయిస్టు కేడర్ పోలీసుల ఎదుట లొంగిపోగా, వారి నుంచి 238 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం ముగ్గురు ముమ్మర అజ్ఞాత కేడర్ సభ్యులు మాత్రమే రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల్లోని వివిధ కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వారిలో సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఒకరని పోలీసులు ఓ ప్రకటనలో వివరించారు. ఆయన కూడా లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More